వెన్నుపోటు దారులకు, నాకు యుద్ధం జరుగుతోందని ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితమే పల్నాడు జిల్లా వినుకొండకు సీఎం జగన్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా జగనన్న చేదోడు పథకం మూడో విడత సాయం అందజేశారు. అనతరం సీఎం జగన్ మాట్లాడుతూ, వెన్నుపోటు దారులకు, మీ బిడ్డ జగన్ కు మధ్య యుద్దం జరుగుతుంది.. మీ బిడ్డ కు పొత్తులు ఉండవు…ఒంటరిగా సింహం లా పోరాడతాడని తెలిపారు.

తోడేళ్ళు అందరు ఒక్కటైనా పేద ప్రజలు ఇచ్చిన బలం తో పోరాటం చేస్తానని ప్రకటించారు సీఎం జగన్. ఎక్కడా వివక్షకు, అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు జరుగుతోంది.. గత ప్రభుత్వాలు బలహీన వర్గాలను పట్టించుకోలేదు.. గ్రోత్ రేటులో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నామని వెల్లడించారు సీఎం జగన్. నవరత్నాల ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు.. ఈ మూడేళ్ల కాలంలో రూ.927 కోట్లు లబ్ధిదారులకు అందించామన్నారు సీఎం జగన్.