తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది .ఇవాళ మంచిర్యాల,కుమరంభీం ఆసిఫాబాద్, ములుగు,జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది.
ఆదిలాబాద్, నిర్మల్,రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్,ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం ఈ రోజు బలహీనపడినట్లు పేర్కొంది. రుతుపవన ద్రోణి ఈరోజు జైసాల్మయిర్, కోట, గుణ, కళింగపట్నం తూర్పు ప్రాంతం గుండా మధ్య బంగాళాఖాతం వరకు పయనిస్తూ సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు వెల్లడించింది.మరో అల్పపీడనం ఈ నెల 19న పశ్చిమ మధ్య దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.