తెలంగాణాలో హైఅలెర్ట్@272

-

తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముందు తగ్గిన కరోనా ఒక్కసారిగా రాష్ట్రంలో పెరిగిపోయాయి. రెండు రోజుల్లో వంద కేసులకు పైగా నమోదు కావడం తో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాలలోను తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇప్పుడు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 272 కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 43 కేసులు బయటకు రావడం తో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణాలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. హైదరాబాద్ లోనే వందకు పైగా కరోనా బాధితులు ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి వరంగల్, నల్గొండ, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వ౦ చాలా వరకు జాగ్రత్తగానే ఉంది. రాష్ట్రంలో 11 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తెలంగాణాలో 228 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news