హిజ్రాలకు 5 కిలోల బియ్యం ఇవ్వండి : తెలంగాణ హైకోర్టు

-

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ దెబ్బకి అనేక మంది నిరాశ్రయులయ్యారు. కొంతమంది వారి ఆత్మ అభిమానం చంపుకోలేక చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ వల్ల అనేక మంది వారి ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో వారందరూ ఆర్థికంగా చితికిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా చివరికి రోజురోజుకీ దేశంలో కరోనా పెరుగుతూనే ఉంది.

High-court-for-state-of-Telangana-at-Hyderabad
High-court-for-state-of-Telangana-at-Hyderabad

ఇక ఇదే నేపథ్యంలో తాజాగా హిజ్రాలకు ఉచిత బియ్యం అందివ్వాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రేషన్ కార్డు లేని వారికి అయినా సరే హిజ్రాలకు ఆర్థిక, వైద్య సహాయం అందించేలా హైకోర్టులో విచారణ కొనసాగింది. దీంతో హైకోర్టు ధర్మాసనం ట్రాన్స్జెండర్ లకు సహాయం అందించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. దీంతో విచారణ జరిపిన హైకోర్టు ” ప్రధానమంత్రి యోజన పథకం” కింద రేషన్ కార్డు లేని ట్రాన్స్జెండర్ లకు 5 కిలోల బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలాంటి విషయాల్లో కేంద్ర పథకాలు ఉపయోగిస్తే వాటి భారం రాష్ట్ర ప్రభుత్వాలపై పడదని హైకోర్టు తన అభిప్రాయాన్ని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news