ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగాలపై హామీ ఇచ్చిన‌ హైకోర్టు..

-

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఈరోజు ప్రభుత్వం, యూనియన్ల మధ్య వాదనలు జరిగాయి. ఈ క్ర‌మంలోనే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. ఇదిలా ఉంటే కొత్త వారిని నియమించుకోవడానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. దానిలో భాగంగానే.. తాత్కాలిక నియామకాల పేరుతో డ్రైవర్లను, కండక్టర్లను నియమించుకుంది. దీంతో కొంతమంది కార్మికులు.. ఉద్యోగం పోయిందన్న భయంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు దిగులుతో మంచానపడ్డారు.

అయితే మంగళవారం హై కోర్టు వ్యాఖ్యలు కార్మికులకు కాస్త ఊరటనిచ్చాయి. ‘ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించి ప్రభుత్వంలో చర్చలు జరపాలి’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కార్మికుల ఉద్యోగాలు భద్రంగానే ఉన్నాయి కాబట్టే చర్చలు జరపాలని చెప్పింది. నిజానికి ర్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసినా..దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు గానీ, నోటిఫికేషన్ గానీ విడుదల కాలేదు. దీన్ని బట్టి కార్మికుల ఉద్యోగాలు భద్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 18లోగా చర్చలు ముగించి శుభవార్తతో రావాలని హైకోర్ట్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news