ఆర్టీసీ స‌మ్మెపై హైకోర్టులో కీల‌క నిర్ణ‌యం..

-

తెలంగాణ‌లో ఆర్టీసీ స‌మ్మె 11వ రోజుకు చేరుకుంది. అయితే ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 15న(నేడు) వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే నేడు హైకోర్టు తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కీల‌కం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించాలని హైకోర్టు కోరింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కార్మికులకు సూచించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయపరమైనవే కావొచ్చు కానీ, సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే చర్చలు జరిపే వీలు లేకుండా పోయిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

సమ్మె కార్మికుల ఆఖరి అస్త్రం అని, సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కారం కావని కార్మిక సంఘాలు వాదించాయి. మరోవైపు కార్మిక సంఘాలు కోరుతున్నట్టు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదించారు. ఇలా హోరా హోరీగా నేడు హైకోర్టులో వాద‌న‌లు కొన‌సాగాయి. కాగా, ఇరు పక్షాల వాదనను విన్న కోర్టు కేసు తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news