కౌంటర్ వేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కాంట్రాక్టు నర్సులకు నెలల తరబడి బకాయి ఉన్న వేతనాలను చెల్లించాలని సూచించింది. రెమిడెసివర్ ఇంజెక్షన్ల వినియోగ కాలపరిమితిని ఏడాదికి పెంచుతూ డీసీఐ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వ న్యాయవాది ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కరోనా వేళ మానసిక రోగులకు ఎలాంటి వైద్యచికిత్సలు అందిస్తున్నారని ఆరా తీసింది. మెంటల్ హెల్త్ యాక్టును ఏ విధంగా తీసుకొచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యలపై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.