కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు సైతం కరోనా భారీన పడుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైరస్ భారీన పడ్డారు. తాజాగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ అని తేలింది. కొన్ని రోజుల క్రితం ఆయన సిబ్బందికి వైరస్ నిర్ధారణ అయింది. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు.