తెలంగాణాలో మే 7 వరకు లాక్ డౌన్ విధించే అవకాశాలు కనపడుతున్నాయి. మార్చ్ నుంచి 3 నెలల పాటు ఇంటి అద్దె వసూలు చేయకుండా ఇంటి యజమానులకు ఆదేశాలు ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. తెలంగాణాలో కేసులు పెరిగితే లాక్ డౌన్ ని సడలిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ఫుడ్ డెలివరి సర్వీసులను కూడా అనుమతించకుండా ఉంటే మంచిది అని సర్కార్ భావిస్తుంది.
ప్రస్తుతం తెలంగాణా కేబినేట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ సర్కార్ తెలంగాణాలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ని విధించింది. కేంద్రం మే 3 వరకు అని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ విషయంలో ప్రజల ఆలోచన మారిస్తే లొసుగులను వాడుకుని బయటకు వచ్చే అవకాశం ఉందని కాబట్టి లాక్ డౌన్ ని పెంచడమే మంచిది అని సర్కార్ భావిస్తుంది.
ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రానికి తెలంగాణా సర్కార్ సమాచారం కూడా పంపింది. ప్రధానంగా హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా సరే భారీగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణాలో కేసులు 800 దాటాయి.