వ్య‌వ‌సాయం రాద‌ని ఈస‌డించుకున్నారు… మేమేంటో నిరూపించాం

-

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేరుస్తూ తెలంగాణ రాష్ట్రం ఏడు సంవ‌త్స‌రాల వ‌య‌సును పూర్తిచేసుకుంద‌ని, అభివృద్ధి ప‌థంలో అనేక రాష్ట్రాల‌నుదాటి ముందంజ‌లో ఉంద‌ని రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. ‌దేశంలో క‌రోనా సంక్షోభాన్ని త‌ట్టుకొని నిల‌బ‌డిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే అని చెప్ప‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు. రూ.2,30,825 కోట్ల అంచ‌నా వ్య‌యంతో మంత్రి గురువారం శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. రెవెన్యూ వ్య‌యం రూ.1,69,383.44 కోట్లుగా పేర్కొన్న హ‌రీష్‌రావు స‌మ‌స్య‌ల‌ను, స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తున్నామ‌ని, ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నిస్తున్నామంటూ ఇంత పెద్ద బాధ్య‌త‌లు అప్ప‌గించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఆర్థిక‌లోటును 45,509.60 కోట్ల వ్య‌యంగా అంచ‌నా వేశారు. కొవిడ్ వల్ల రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లినా, ఆ ప్రభావం పద్దుపై ఏమాత్రం కనిపించకుండా మంత్రి జాగ్ర‌త్త ప‌డ్డారు. కీలక రంగాలకు సంబంధించిన కేటాయింపుల్లో ఎక్క‌డా మాట త‌ప్ప‌లేద‌ని, ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

ఏడేళ్ల‌లో అద్భుత పురోగ‌తి

బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా హ‌రీష్ రావు అసెంబ్లీలో త‌న వాక్చాతుర్యంతో అంద‌రినీ క‌ట్టిప‌డేశారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక వ్యవసాయ రంగం అద్భుతంగా పురోగ‌మించింద‌ని, ప్రభుత్వం తీసుకున్న ప్రగతి శీల చర్యల వల్లే ఈ రంగం అభివృద్ధి చెందిందని స్ప‌ష్టం చేశారు. 2014-15లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.41 కోట్ల ఎకరాలుగా ఉంటే అది 2020-21నాటికి 2.10 కోట్ల ఎకరాలకు పెరిగిందని, సాగు విస్తీర్ణం 49 శాతానికిపైగా పెర‌గ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌న్నారు. 60 లక్షల ఎక‌రాల్లో ప‌త్తిని పండిస్తూ దేశంలో రెండోస్థానంలో తెలంగాణ నిలిచింద‌ని, వరి సేకరణలోకూడా రెండోస్థానంలో ఉన్న‌ట్లు ఎఫ్ సీఐ తెలిపింద‌నే విష‌యాన్ని గుర్తుచేశారు. ‘‘2019-20లో తెలంగాణలో 193 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. అందులో 111 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించింది. 2020 యాసంగిలో తెలంగాణ‌ ఎఫ్‌సీఐకి 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అందించింద‌ని, ఎఫ్‌సీఐ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో ఇది 56 శాత‌మ‌ని మంత్రి వివ‌రించారు.

ప‌త్తిలో ప్ర‌థ‌మం, వ‌రిలో ద్వితీయం

ఈ యాసంగి సాగులో తెలంగాణ 52 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంతో దేశంలో మొదటి స్థానంలో నిలించింద‌ని, 25 లక్షల ఎకరాలతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా, 20.90 లక్షల ఎకరాలతో ఆంధ్ర మూడో స్థానంలో ఉంద‌న్నారు. ఒకనాడు తెలంగాణకు వ్యవసాయం రాదని ఈసడించుకున్న వాళ్లే నేడు తెలంగాణ వ్యవసాయాన్ని చూసి ఈర్ష్య పడే విధంగా.. వ్యవసాయ రంగంలో అపూర్వమైన పురోగ‌తిని సాధించ‌గ‌లిగామ‌న్నారు. స్వయంగా రైతు అయిన కేసీఆర్‌కు రైతుల కష్టనష్టాలు తెలుస‌ని, అందుకే రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన వ్యవసాయ పథకాలకు ఐక్యరాజ్య సమితి నుంచి ప్రశంసలు దక్కాయన్న మంత్రి.. మన పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. తెలంగాణ వ్యవసాయ సమృద్ధితో కళకళలాడుతోందని ఆనందం వ్యక్తం చేశారు.
రూ.2,30,825 కోట్ల బడ్జెట్

రూ.2,30,825 కోట్ల బడ్జెట్

2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మొత్తం బడ్జెట్ విలువ రూ.2,30,825 కోట్లు అని తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ వ్యయాన్ని రూ.1,69,383.44 కోట్లుగా చూపించిన మంత్రి హరీశ్.. ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లుగా, మూలధన వ్యయం రూ.29,046.77 కోట్లుగా, పెట్టుబడి వ్యయం రూ.29,046.77 కోట్లుగా, రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లుగా పేర్కొన్నారు.

బ‌డ్జెట్ విలువ‌

మొత్తం బ‌డ్జెట్ విలువ‌: 2 లక్షల 30 వేల 825 కోట్లు
రెవెన్యూ వ్యయం: లక్షా 69 వేల 383.44 కోట్లు
క్యాపిటల్ వ్యయం: రూ. 29 వేల 46 కోట్లు
రెవెన్యూ మిగులు: రూ. 6743.50 కోట్లు
ఆర్థిక లోటు: 45,509 కోట్లు

కేటాయింపులు:

ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులు
ఎమ్మెల్సీలకు 800 కోట్లు కేటాయింపు: హరీశ్‌రావు
నూతన సచివాలయ నిర్మాణానికి రూ.610 కోట్లు
రీజనల్‌ రింగ్‌రోడ్డు భూసేకరణకు రూ.750 కోట్లు
అటవీశాఖకు రూ.1276 కోట్లు
ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు
పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధికి రూ.29,271 కోట్లు ఇచ్చారు. గత బడ్జెట్‌ కంటే 48 వేల కోట్లు అధికంగా కేటాయించారు.
దేవాదాయశాఖకు రూ.720 కోట్లు
రైతుబంధుకు రూ.14,800 కోట్లు
రుణమాఫీకి రూ.5,225 కోట్లు
వ్యవసాయరంగానికి రూ.25వేల కోట్లు
పశుసంవర్థక, మత్స్యశాఖకు రూ.1730 కోట్లు
సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు
సమ‌గ్ర భూసర్వే కోసం రూ.400 కోట్లు
రైతుభీమా పథకానికి రూ.1200 కోట్లు
వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.1500 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.11,728 కోట్లు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.2,750 కోట్లు
సుంకిశాల తాగునీటి ప్రాజెక్ట్‌కు రూ.725 కోట్లు
మూసీ నది పునరుజ్జీవం కోసం రూ200 కోట్లు
మెట్రో రైలుకు రూ.1000 కోట్లు
ఓఆర్‌ఆర్‌ వెలుపలి కాలనీల తాగునీటి కోసం రూ.250 కోట్లు
వరంగల్‌ కార్పొరేషన్‌కు 250 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్‌కు 150 కోట్లు
సీఎం దళిత ఎంపవర్‌మెంట్‌ కోసం రూ.1000 కోట్లు
పల్లె ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు రూ.5761 కోట్లు
గీత కార్మికుల సంక్షేమానికి రూ.25 కోట్లు
గొల్ల కురుమలకు రూ.300 కోట్లతో 3 లక్షల యూనిట్ల గొర్రెలు
చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.338 కోట్లు
బీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
బీసీ సంక్షేమశాఖకు రూ.5,522 కోట్లు
మైనార్టీల సంక్షేమానికి రూ.1600 కోట్లు
పోలీస్‌ స్టేషన్లలో షీ టాయిలెట్ల నిర్మాణానికి రూ.20 కోట్లు
యూనివర్సిటీల్లో షీ టాయిలెట్ల నిర్మాణానికి రూ.10 కోట్లు
స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.3 వేల కోట్లు
మహిళ శిశు సంక్షేమం రూ.1702 కోట్లు
డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కోసం రూ.11 వేల కోట్లు
పట్టణ ప్రగతి కోసం రూ.500 కోట్లు
వైకుంఠ దామాల నిర్మాణానికి రూ.200 కోట్లు
ఉచిత మంచినీటి సరఫరా కోసం రూ.250 కోట్లు
సుంకిశాల తాగునీటి ప్రాజెక్ట్‌కు రూ.725 కోట్లు
మూసీ నది పునరుజ్జీవం కోసం రూ200 కోట్లు
మెట్రో రైలుకు రూ.1000 కోట్లు
ఓఆర్‌ఆర్‌ వెలుపలి కాలనీల తాగునీటి కోసం రూ.250 కోట్లు
వరంగల్‌ కార్పొరేషన్‌కు 250 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్‌కు 150 కోట్లు
మున్సిపల్‌శాఖకు రూ.15,030 కోట్లు
వైద్య, ఆరోగ్యశాఖకు రూ.6,295 కోట్లు
ఐటీ రంగానికి రూ.360 కోట్లు
రహ‌దారులు, భవనాలశాఖకు రూ.8,788 కోట్లు
పంచాయతీరాజ్‌ రహదారులకు రూ.300 కోట్లు
పోలీస్‌ శాఖకు రూ.725 కోట్లు
రాష్ట్రంలో కొత్తగా 21 ఆర్వోబీ, ఆర్‌యూబీలకు రూ.400 కోట్లు
కొత్త ఎయిర్‌పోర్టుల కోసం రూ.100 కోట్లు
హోంశాఖకు రూ.6,465 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.2,363 కోట్లు
టూరిజం రూ.726 కోట్లు
పాఠశాల విద్య రూ.11,735 కోట్లు
ఉన్నత విద్య రూ.1,873 కోట్లు
విద్యారంగ ఉన్నతీకరణకు రూ.4 వేల కోట్లు
ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణకు రూ.2 వేల కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.3,077 కోట్లు
ఐటీ రంగానికి రూ.360 కోట్లు
రహ‌దారులు, భవనాలశాఖకు రూ.8,788 కోట్లు
పంచాయతీరాజ్‌ రహదారులకు రూ.300 కోట్లు
పోలీస్‌ శాఖకు రూ.725 కోట్లు
రాష్ట్రంలో కొత్తగా 21 ఆర్వోబీ, ఆర్‌యూబీలకు రూ.400 కోట్లు
కొత్త ఎయిర్‌పోర్టుల కోసం రూ.100 కోట్లు
హోంశాఖకు రూ.6,465 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.2,363 కోట్లు
టూరిజం రూ.726 కోట్లు
రూ.360 కోట్లు
రహ‌దారులు, భవనాలశాఖకు రూ.8,788 కోట్లు
పంచాయతీరాజ్‌ రహదారులకు రూ.300 కోట్లు
పోలీస్‌ శాఖకు రూ.725 కోట్లు
రాష్ట్రంలో కొత్తగా 21 ఆర్వోబీ, ఆర్‌యూబీలకు రూ.400 కోట్లు
కొత్త ఎయిర్‌పోర్టుల కోసం రూ.100 కోట్లు
హోంశాఖకు రూ.6,465 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.2,363 కోట్లు
టూరిజం రూ.726 కోట్లు
రూ.20 కోట్లు
యూనివర్సిటీల్లో షీ టాయిలెట్ల నిర్మాణానికి రూ.10 కోట్లు
స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.3 వేల కోట్లు
మహిళ శిశు సంక్షేమం రూ.1702 కోట్లు
డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కోసం రూ.11 వేల కోట్లు
పట్టణ ప్రగతి కోసం రూ.500 కోట్లు
వైకుంఠ దామాల నిర్మాణానికి రూ.200 కోట్లు
ఉచిత మంచినీటి సరఫరా కోసం రూ.250 కోట్లు
మున్సిపల్‌శాఖకు రూ.15,030 కోట్లు
వైద్య, ఆరోగ్యశాఖకు రూ.6,295 కోట్లు
పాఠశాల విద్య రూ.11,735 కోట్లు
ఉన్నత విద్య రూ.1,873 కోట్లు
విద్యారంగ ఉన్నతీకరణకు రూ.4 వేల కోట్లు
ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణకు రూ.2 వేల కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.3,077 కోట్లు

 

Read more RELATED
Recommended to you

Latest news