తెలంగాణ నెంబ‌ర్ వ‌న్‌.. గ్రామ పంచాయ‌తిల్లో ఆన్ లైన్ ఆడిట్ పూర్తి

-

తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఆడిట్ ను పూర్తి అయింది. దీంతో గ్రామ పంచాయతీ ల్లో వంద శాతం ఆడిట్ చేసిన రాష్ట్రా ల‌లో తెలంగాణ రాష్ట్రం మొద‌టి స్థానం లో ఉంది. అయితే దేశ వ్యాప్తం గా గ్రామ పంచాయతీల‌కు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇస్తున్న నిధులు, వాటి వినియోగం ఆన్ లైన్ ఆడిట్ నిర్వ‌హిస్తున్నారు. మొద‌టి స్థానం లో తెలంగాణ ఉండ‌గా.. రెండో స్థానం లో ఆంధ్ర ప్ర‌దేశ్ ఉంది. ఏపీ లో 49 శాతం ఆన్ లైన్ ఆడిట్ పూర్తి అయింది.

త‌ర్వాతి స్థానాల‌లో త‌మిళ నాడు, ఒడిశా, క‌ర్ణాట‌క రాష్ట్రాలు ఉన్నాయి. కాగ తెలంగాణ లో 2020 2021 ఆర్థిక సంవ‌త్సరాని కి సంబంధిచి తెలంగాణ లో మొత్తం 12,769 గ్రామా పంచాయతీ ల‌లో యుద్ధ ప్రాతి పాదికన ఆన్ లైన్ ఆడిట్ పూర్తి చేశామ‌ని రాష్ట్ర ఆర్థిక శాఖ డైరెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర రావు తెలిపారు. అయితే ఈ ఆన్ లైన్ ఆడిట్ ప్ర‌క్రియ స‌మ‌యం లో 2,11,816 అభ్యంత‌రాలు న‌మోదు చేశామ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news