చెట్లు నరికినందుకు తెలంగాణా అధికారుల భారీ జరిమానా, అంతే కాదండోయ్…!

-

మొక్కలు నాటే విషయంలో, రాష్ట్రంలో అడవులను పెంచే విషయంలో తెలంగాణా ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా అడవుల పెంపకం విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా సీరియస్ గా ఉన్నారు. మొక్క ఎండినా, ఆకు రాలినా సరే అధికారుల గుండెల్లో ఆయన నిద్రపోతున్నారు. ఈ నేపధ్యంలో ఒక చిన్న సంఘటన జరిగింది. హైదరాబాద్ లోని కూకటపల్లి లో ఈ ఘటన చోటు చేసుకుంది.

కూకట్‌పల్లిలోని ‘ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్’ గేటెడ్ కమ్యూనిటీలో అనుమతి లేకుండా సుమారు 40 చెట్లు నిర్వాహకులు నరికేశారు. ఈ విషయం అటవీ శాఖ అధికారులకు తెలియడంతో మేడ్చల్ జిల్లా అటవీ అధికారి సుధాకర్ రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలికి వచ్చి పరిస్థితి చూసారు. వాల్టా చట్టం అతిక్రమణ కింద అటవీ అధికారులు జరిమానా విధించారు. అంతే కాకుండా ఆ చెట్లు తిరిగి నాటాలని ఆదేశించారు అధికారులు.

బాధ్యులపై రూ.53,900 జరిమానా విధించారు. కొట్టిన చెట్లకు బదులుగా 80 మొక్కలు నాటి సంరక్షించాలని ఒక షరతు విధించారు. కమ్యూనిటీలో అదనపు సౌకర్యాల కల్పన కోసం చెట్లు కూల్చాల్సి వచ్చిందని, కొట్టేసిన చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేశామని వచ్చిందని గేటెడ్ కమ్యూనిటీ నిర్వాహకులు చెప్పగా… అది శాస్త్రీయంగా జరగలేదని అధికారులు గుర్తించారు. అందుకే బాధ్యులపై కాస్త సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news