కృష్ణా బోర్డు సమావేశాన్ని వాకౌట్ చేసిన తెలంగాణ అధికారులు

ఆంధ్ర ప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యం లోనే ఇవాళ కృష్ణా బోర్డు సమావేశం అయింది. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు హజరయ్యారు. ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగింది ఈ సమావేశం. అయితే.. కాసేపటి క్రితమే… కేఆర్ఎంబి సమావేశాన్ని వాకౌట్ చేశారు తెలంగాణ అధికారులు.

ఆ సమావేశం నుంచి అసంతృప్తిగా చెందుతూ బయటకు వచ్చారు. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అంశాల పై చర్చ సందర్భంగా ఇరు రాష్టాల అధికారుల మధ్య భిన్నాభి ప్రాయాలు రావడంతో కృష్ణా బోర్డు సమావేశాన్ని వాకౌట్‌ చేసినట్లు సమాచారం అందుతోంది. కాగా… జలసౌధలో 6 గంటలుగా కే ఆర్ ఎం బీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బలంగా తెలంగాణ వాదనలు వినిపించారు ఇరిగేషన్ అధికారులు. అంతేకాదు… కేఆర్ఎంబి అధికారులపై తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా మండిపడ్డారు. ఇక చివరికి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అంశాల పై భిన్యాభ్రియాల కారణంగా ఈ సమావేశాన్ని తెలంగాణ అధికారులు వాకౌట్‌ చేశారు.