తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. మూడు రోజుల పాటు వర్షాలు.

-

తెలంగాణలో చలి తీవ్రత తగ్గింది. నిన్న మొన్నటి దాకా చలి తీవ్రతతో తెలంగాణ గజగజ వణికింది. ఉష్ణోగ్రతలను గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో చలి తీవ్రత పెద్దగా లేదు. ఇప్పుడిప్పుడే చలి ప్రభావం నుంచి జనాలు బయటపడుతున్నారు.  ఇదిలా ఉంటే రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా పొగమంచు తీవ్రత కూడా పెరిగింది.

ఇదిలాా ఉంటే.. తెలంగాణలో మూడు రోజుల్లో  తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి తోడు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీలపైన నమోదుకావడంతో పాటు పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ కేంద్ర వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news