తెలంగాణా… రైస్ బౌల్ ఆఫ్ ఇండియా…!

-

తెలంగాణాలో క్రమంగా పంటల దిగుబడి పెరుగుతూ వస్తుంది. దీనిపై రాష్ట్ర సిఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి వసతి పెరిగింది కాబట్టి పంటల దిగుబడి కూడా పెరుగుతుంది. ఇక ఆయన మంగళవారం వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. వేసవి పంటల కొనుగోలు, వానాకాలం సాగు ఏర్పాట్లు, ఎరువుల లభ్యత, గోదాములు- రైతు వేదికల నిర్మాణం, పంటలకు మద్దతు ధర రాబట్టే విధానం,

పౌర సరఫరాల సంస్థ కార్యకలాపాలను విస్తరించడం, రైతుబంధు సమతిలను క్రియాశీలం చేయడం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సాగునీటి వసతి పెరుగుతున్నందున రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. పంటల విస్తీర్ణం, దిగుబడి పెరుగుతున్నందున, పండిన పంటలకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్ర వ్యూహాన్ని ఖరారు చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్ధ్యం కలిగిన గోదాములు, 2500 రైతు వేదికలు నిర్మించాలని అధికారులను సిఎం ఆదేశించారు. రైతుబంధు సమితులను క్రియాశీలం చేసేందుకు అవసరమైన విధానం ఖరారు చేయాలని సూచించారు. జూన్ నెలకు సంబంధించిన ఎరువులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నందున రైతులు వాటిని కొనుగోలు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేసారు. నకిలీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అమ్మే వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సిఎం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news