కొంత మంది ఎందుకు చనిపొతారో అర్ధం కాదు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలా మంది ఒక బలమైన కారణం లేకుండానే చేసుకుంటూనే ఉంటారు. తాజాగా ఒక అమ్మాయి ఇలాగే చనిపోయింది. చిత్తూరు జిల్లా కలకడ మండల కేంద్రం ఇందిరమ్మ కాలనీలో అంజనా దేవి ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తుండగా ఆమె కుమార్తె 18 ఏళ్ళ రంజిత విజయవాడలో నీట్ పరీక్షా కోచింగ్ తీసుకుంటుంది.
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడం తో కొన్ని రోజుల క్రితం ఇంటికి వచ్చిన ఆమె తల్లి వద్ద ఉంటుంది. అక్కడి వరకు బాగానే ఉంది గాని ఈ తరుణంలో ఒక సంఘటన జరిగింది. ఆమె తరుచుగా తనతో పాటుగా కోచింగ్ తీసుకునే సాటి విధ్యార్ధులతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అయితే గత మూడు రోజులుగా ఆమెతో సన్నిహితంగా ఉండే ఒక విద్యార్ధి ఫోన్ చేయడం లేదు.
దీనితో తనను దూరం పెడుతున్నారని భావించిన రంజిత ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి విధులు ముగించుకుని ఇంటికి రాగా ఆమె ఫ్యాన్ కి ఉరి వేసుకుని కనపడింది. పెద్ద పెద్దగా కేకలు వేయడం తో చుట్టూ ఉన్న వారు వచ్చి చూసారు. అప్పటికే రంజిత చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.