పెళ్లిళ్లు చేసుకునే వారికి తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్

-

తెలంగాణ ఆర్టీసీ ని తిరిగి లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం అనేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఎండీగా మాజీ ఐపీఎస్ సజ్జనర్ బాధ్యతలు తీసుకున్న అప్పటి నుంచి.. అనేక మార్పులతో తెలంగాణ ఆర్టీసీ దూసుకుపోతోంది. ప్రయాణికులకు.. ఆర్టీసీ సర్వీసు దగ్గర చేసేందుకు అనేక ప్రణాళికలు రచిస్తోంది తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం.

ఇప్పటికే చాలా ఆఫర్ లు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటుంది ఆర్టీసీ. ఇక తాజాగా కొత్తగా పెళ్లి చేసుకునే వారికి తెలంగాణ ఆర్టీసీ మరో ఆఫర్ ప్రకటించింది.

పెళ్లిళ్లకు మరియు శుభకార్యాలకు ఒక నెల ముందు తెలంగాణ ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకున్నచో… 20% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఆర్టిసి ఎండి సజ్జనార్ ప్రకటన చేశారు. సాధారణ చార్జీల కంటే 15 శాతం తగ్గింపు కూడా ఇస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక గా ప్రకటన చేశారు ఆర్టిసి ఎండి సజ్జనర్.ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news