త్వరలోనే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంపు

-

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు అలాగే కార్మికులకు అదిరిపోయే శుభవార్త. తెలంగాణ ఉద్యోగులు మరియు కార్మికులకు త్వరలో 2017 పిఆర్సి అమలు చేస్తామని ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రకటన చేశారు. త్వరలో ఈ విషయంపై సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటన చేస్తారని ఆయన వివరించారు. కాగా ఆర్టీసీలో పిఆర్సి ప్రకటనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీకి లేఖ రాయగా, మునుగోడు బై పోల్ నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదు.

ఇప్పుడు కోడ్ ముగియడంతో పిఆర్సి ప్రకటించే ఛాన్స్ ఉంది. అటు పి అర్ సి బకాయిలు ప్రభుత్వం భరిస్తుందా లేక ఆర్టీసీ భరిస్తుందా అనే దానిపై సస్పెన్షన్ నెలకొంది. తెలంగాణ ఆర్టీసీ స్మార్ట్ గా టికెట్లను జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీని ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు చిల్లర సమస్య అలాగే లెక్కల్లో తేడాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల ద్వారా డిజిటల్ పేమెంట్ చేసి, టికెట్లు పొద్దేలా యంత్రాలను జారీ చేస్తోంది. మెట్రో రైల్ తరహా లోనే స్మార్ట్ కార్డులను జారీ చేయడంతో పాటు మొబైల్ ఫోన్ల లోనే, అన్ని రకాల పాస్ లు తీసుకునేలా చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news