పిల్లలకు ఒమిక్రాన్ వైరస్ సోకడం పై తెలంగాణ సర్కార్ క్లారిటీ

-

ఒమిక్రాన్ వైరస్ పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేరియంట్ పై అప్రమత్తమయ్యామని పేర్కొన్నారు. గుంగుంపులుగా ఉండొద్దు…జనాలు జాగ్రత్తగా ఉండాలి…మాస్క్ తప్పనిసరిగా వాడాలని సూచనలు చేశారు. భౌతిక దూరం పాటించాలి…కేసులు తగ్గాయని.. జనాల్లో నిర్లక్ష్యం వచ్చింది. కానీ.. మరోసారి అప్రమత్తం అవ్వాల్సిన టైం వచ్చిందని వెల్లడించారు.

ఒమిక్రాన్ వైరస్ కొన్నిదేశాల్లో మాత్రమే వ్యాపిస్తోందనీ..విదేశాల నుంచి వస్తున్న వారి నుంచి.. కొత్త మ్యుటేషన్ మన దగ్గర ఎంటర్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కోవిడ్ ప్రభావం తగ్గింది కానీ.. కనుమరుగు కాలేదని….ప్రభుత్వం తరఫు నుంచి సిద్ధంగా ఉన్నాం… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొత్త వేరియంట్ లక్షణాలు కూడా ఒకే రకంగా ఉంటాయి…డెల్టా వేరియంట్ కంటే… 30 శాతం తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసారు. థర్డ్ వేవ్ లో కేవలం చిన్నపిల్లలకు సోకుతుంది అనే అపోహ వీడండి. పేరెంట్స్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చిన్నపిల్లలకు కరోనా సోకుతుంది కానీ… తీవ్రత ఎక్కువగా ఉండదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కూడా జరగలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news