మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారతదేశంలో ఇన్స్యూరెన్స్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
ఇన్స్యూరెన్స్ రంగంలో దిగ్గజ కంపెనీ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దీనిలో మొత్తం వంద ఖాళీలున్నాయి. సెలెక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వానికి ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది.
వీళ్ళని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ విభాగాల్లో నియమిస్తారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ వంటి వాటిలో పని చేయాలి. పార్ట్ టైమ్ ఉద్యోగాలు మాత్రమే ఇవి. న్యూ ఢిల్లీ లో పోస్టింగ్ ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 31 చివరి తేదీ. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే..
ముందు నేషనల్ కెరీర్ సర్వీస్ వెబ్‌సైట్ https://www.ncs.gov.in/job-seeker ఓపెన్ చెయ్యాలి.
ఎల్ఐసీ జాబ్ పోస్టింగ్‌లో అప్లై పైన క్లిక్ చేయాలి.
కొత్త యూజర్ అయితే New User పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి.
నెక్స్ట్ మీరు జాబ్ సీకర్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ మీరు సబ్మిట్ చేయాలి.
రిజిస్ట్రేషన్ అయ్యాక మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
ఇలా లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్‌లో ఇతర సెక్షన్స్ పూర్తి చేయాలి.
ఆ తర్వాత ఎల్ఐసీ అడ్వైజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలి.
మీ పాత యూజర్ అయితే యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
జాబ్ సెర్చ్‌లో ఎల్ఐసీ అడ్వజర్ పోస్టును సెర్చ్ చేయాలి.
నెక్స్ట్ మీరు దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి.
దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి జాగ్రత్త పెట్టుకోండి.