తెలంగాణ రాష్ట్ర టెన్త్ క్లాస్ విద్యార్థులకు అలర్ట్. టెన్త్ ఎగ్జామ్స్ వచ్చే మే నెలలో నిర్వహించాలని ఎస్ఎస్సి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కసరత్తు కూడా ఎస్ఎస్సి బోర్డు ప్రారంభించింది. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ను కూడా వెల్లడించే వీలు ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన పరీక్షల విభాగం డైరెక్టర్ సర్క్యులర్ కూడా జారీ చేసారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమగ్ర వివరాలతో కూడిన జాబితాను రూపొందించి వీలైనంత త్వరగా వీటిని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. త్వరగా పదో తరగతి సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేపట్టాలని అలాగే పరీక్షల కోణంలో విద్యార్థులను సిద్ధం చేయాలని సూచన చేశారు.
కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి టెన్త్ పరీక్షలు ఏప్రిల్ మాసం లోనే జరగాల్సి ఉంది. కానీ ఇటీవల కరోనా మహమ్మారి కేసులు పెరిగిన నేపథ్యంలో… కాస్త ఆలస్యం కానుంది. ఇంటర్ ఎగ్జామ్స్ అయిన వెంటనే… టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు.