బ్రేకింగ్ : తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. వీఆర్వో వ్యవస్థ రద్దు !

-

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌లకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులు స్వాధీనం చేసుకుని సా.5 గంటల కల్లా రిపోర్ట్‌ పంపాలని కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని వారికి ఆదేశాలు అందాయి.

ఈ మేరకు తహశీల్దార్ల నుంచి వీఆర్వోలందరికి ఆదేశాలు అందాయని రెవెన్యూ ఉద్యోగుల సంఘం పేర్కొంది. ఈ విషయం మాకు చాలా అనుమానాలు ఉన్నాయని, మా అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం పేర్కొంది. మా సర్వీస్ పరిస్థితి ఏంటి? మేము ఏ శాఖలో ఉద్యోగులం అవుతామో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ రద్దు నిర్ణయం ఇప్పటిదాకా చాలా రహస్యంగా ఉంచినట్టు చెబుతున్నారు. అసెంబ్లీలో ఈ మేరకు బిల్ కూడా పాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొద్ది సేపటి క్రితం అసెంబ్లీ మొదలయింది.

Read more RELATED
Recommended to you

Latest news