కల్ట్ క్లాసిక్ మూవీ లవకుశ సినిమాలో లవుడు పాత్రలో నటించిన నాగరాజు కన్నుమూశారు. కొద్దికాలంగా నాగరాజు శ్వాస సంబంధిత జబ్బుతో బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని గాంధీనగర్‌లో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. లవకుశ సినిమాలో లవుడిగా నాగరాజు నటించగా, కుశుడిగా సుబ్రహ్మణ్యం నటించారు.
రామయ్య సీతమ్మని అడవుల్లో వదలివేయడంతో ప్రారంభయ్యే ఈ కథలో లవకుశుల జననం, వారు రామాయణాన్ని నేర్చుకోవడం, ఊరూరా తిరిగి దానిని గానం చేయడం, రామ అశ్వమేథ యాగం, అశ్వాన్ని లవకుశులు బంధించి ఏకంగా రామునితోనే యుద్ధం చేయడం లాంటివి సన్నివేశాలు ఉంటాయి. 1963 మార్చిలో విడుదలైన ఈ లవకుశ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొంచెం పెద్దవారు ఎవరైనా ఆ సినిమా అంటే ఆసక్తితో చూస్తారు. 1958లో షూటింగ్ మొదలయిన ఈ సినిమా పూర్తిగా కలర్లో రిలీజ్ అయిన ఈ సినిమా తొలి తెలుగు కలర్ సినిమాగా నిలిచింది.