ఇది నిండు ఎండాకాలం. మరో రెండు నెలల పాటు భగ భగ మండే ఎండలు కొట్టనున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు చెప్పింది.
రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రేపు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షములు కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశములు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవరించి ఉందని…. దాని నుండి తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.దీని ప్రభావంతోనే ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అదే విధంగా రేపటి నుండి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.