దేశవ్యాప్తంగా ఎటా దాదాపు 60,000 మంది రాక్షణశాఖ నుంచి పదవి విరమణ చేస్తున్నారు. రిటైరయ్యె సమయానికి వీరి వయసు 34 నుంచి 48 ఏళ్ల వరకూ ఉంటుంది. ఎక్కువ మంది మళ్ళీ ఇతర ఉద్యోగాలను వెతుక్కుంటున్నారు.వీరిలో 90 నుంచి 99 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే.వారిలో 80.60 శతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు.
అయినా వీరిలో ఎక్కువ మంది సేద్యంలోకి ఎందుకు వెళ్లడం లేదని ఇటీవల “మేనేజ్” అధ్యయనం చేస్తే పంటలు పండించడం ఎలాగో తెలియదని చాలామంది చెప్పారు.ఈ లోపాన్ని అధిగమించి వారిని సేద్యం లోకి మళ్లించేందుకు మేనేజ్ ఒక నివేదికను రూపొందించింది.ఈ ప్రణాళికను వివరిస్తూ భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాకకు లేఖ రాసింది. రాక్షణ సిబ్బంది అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు. వ్యవసాయ రంగంలో వారి ప్రవేశం ఆ రంగంలో ఒకరకమైన క్రమశిక్షణను కూడా తీసుకువస్తుందని అంచనా. రాక్షణశాఖలో వివిధ విభాగాలలో పనిచేసి పదవి విరమణ అయిన సైనికులను మహిళా సిబ్బందిని రైతులుగా, వ్యవసాయ వాణిజ్యవేత్తలుగా (అగ్రి ఏంటర్ ప్రెన్యూర్షిప్ ) మార్చే కొత్త పథకం త్వరలో మొదలుకానుంది. హైద్రాబాద్ లోని జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ (మేనేజ్) రూపాండించిన ఈ పధకానికి కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.దీనికి ‘జై జవాన్ కిసాన్ ‘ అనే పేరు పెట్టారు