ఒకరికి శిక్ష పడితే 100 మందికి భయం రావాలి…..సీపీ

-

ఒక నేరస్తుడికి శిక్ష పడితే 100 మందికి భయం వేస్తుందని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈరోజు ఇన్స్పెక్టర్లు ,ఉన్నతాధికారులు మరియు సిబ్బందితో సమావేశం అయ్యాడు. పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసిన వారి పట్ల మర్యాదగా ఉండాలని అలాగే వారు ఫైల్ చేసిన కేసు త్వరగా పరిష్కరించాలని చెప్పాడు. అవసరమైన ప్రణాళికలు తీసుకొని సిటీలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూసుకోవాలని తెలిపారు.డ్రగ్స్ తీసుకొని రాకుండా సరైన చర్యలు తీసుకోవాలని సిపి ఆదేశించాడు.

 

 

సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను పరిష్కరించడంలో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉందని అలాగే మన వద్ద ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని కేసుల యొక్క రికవరీ రేట్ పెంచాలని కోరాడు. ఈనెల 12న టిఎస్ నాబ్ వ్యవస్థ డైరెక్టర్ గా నియమితుడైన సందీప్ శాండిల్య మాట్లాడుతూ డ్రగ్స్ రహిత తెలంగాణని చేస్తమని పేర్కొన్నాడు. డ్రగ్స్ నివారణకు ప్రతి ఒక్కరూ పోరాడాలని పిల్లలు డ్రగ్స్ వాడకుండా తల్లిదండ్రులు చూడాలని చెప్పాడు. విద్యాసంస్థలు ,ఐటి పబ్బులు బార్లు రేవ్ లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news