- తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు జడ్ ప్లస్ భద్రత ని తొలగించి y క్యాటగిరి భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.వై కేటగిరి అంటే కేసీఆర్ కు 4ప్లస్ 4 గన్ మెన్లతో పాటు ఇంటి దగ్గర కూడా సెంట్రీ ఉంటుంది. కాన్వాయ్ కోసం ప్రభుత్వం ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే మాజీ మంత్రులుగా కొనసాగి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి 2ప్లస్ 2 భద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది.మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు భద్రతని పూర్తిగా తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను మార్చుతూ… తీసివేతల పర్వాన్ని మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ యొక్క భద్రతను వై క్యాటగిరి భద్రతగా మార్చారు. హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లకు కమిషనర్లను మార్చిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ఏ నేతలకు భద్రత అనేది ముఖ్యము అనే దాని పైన చర్చలు జరుపుతున్నాడు
.