పేపర్ లీక్ ఎఫెక్ట్.. TSPSC లో 10 కొత్త పోస్టులు మంజూరు

-

రాష్ట్రంలో TSPSC పేపర్ లీక్ సంచలనం రేకత్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో దిగొచ్చిన రాష్ట్ర సర్కార్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే TSPSC లో కొత్తగా 10 పోస్టులు మంజూరు చేసింది. పరీక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు మంజూరు చేసింది.

అదేవిధంగా సీనియర్, జూనియర్ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్, సీనియర్, జూనియర్ ప్రోగ్రామర్‌, జూనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో లా ఆఫీసర్ పోస్టులకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు టీఎస్​పీఎస్సీ పంపిన ప్రతిపాదనలు సర్కార్‌ ఆమోదించింది.

మరోవైపు టీఎస్​పీఎస్సీ అదనపు కార్యదర్శి పదవికి కొత్త ఐఏఎస్​ అధికారిని నియమించింది. ఐఏఎస్ బీఎం సంతోష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సంతోష్‌ పరీక్షల కంట్రోలర్‌గా వ్యవహరించనున్నారు. ఈ నియామకంతో ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌ బాధ్యతల నుంచి సంతోష్‌ను బదిలీ చేసింది.

ఏఈ  పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు గతంలో పేర్కొన్న టీఎస్‌పీఎస్సీ.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మే 21, 22 తేదీల్లో నాలుగు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news