భవిష్యత్తులో మరింత సమర్ధవంతంగా పనిచేయాలని : సీఎం జగన్‌

-

డాక్టర్‌ వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకానికి జాతీయ స్ధాయిలో గుర్తింపు లభించింది. అవార్డు గెలుచుకోవడంపై వ్యవసాయ శాఖ అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన పీఎంఎఫ్‌బీవై జాతీయ సదస్సులో ఇన్నోవేషన్‌ కేటగిరీలో ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌కు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్‌ అహుజా అందజేశారు. అయితే.. ఈ నేపథ్యంలో నేడు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి, భారత ప్రభుత్వం అందజేసిన జ్ఞాపికను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌ చూపించారు.

Mohan Reddy: Andhra Pradesh CM YS Jagan Mohan Reddy to disburse Rs 38 crore  as marriage aid today | Amaravati News - Times of India

అధికారులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత సమర్ధవంతంగా పనిచేయాలని, దిగుబడుల అంచనాలలో టెక్నాలజీ వినియోగం పెంచాలని సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్ధేశం చేశారు. సాగుచేసిన ప్రతి ఎకరా పంట వివరాలను అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్‌ ద్వారా నమోదు చేయడం, తద్వారా ఉచిత పంటల బీమా పథకాన్ని కేవలం ఈ–క్రాప్‌ నమోదు ఆధారంగా అమలుచేయడం ద్వారా యూనివర్శల్‌ కవరేజిని సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news