హైదరాబాద్‌లో మరో బాలిక కిడ్నాప్ కలకలం

-

హైదరాబాద్లో ఇటీవల చిన్నారుల కిడ్నాప్లు కలకలం రేపుతున్నాయి. అపహరణకు గురవుతున్న వారిలో ఆడపిల్లలే ఉండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల అబిడ్స్లో చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన మరవకముందే తాజాగా హబీబ్నగర్లో 12 ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. కరెంట్ లేని సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఆమెను బలవంతంగా లాక్కెళ్లాడు. కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

అయితే మార్గమధ్యలో దుండగుడి నుంచి బాలిక తప్పించుకుంది. వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీసులు ఆమెను తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చారు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులతో స్థానిక ఠాణాకు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే దుండగుడు తెలిసిన వాడే అయి ఉంటాడని .. అలా దర్జాగా ఇంట్లోకి వెళ్లి బాలికను కిడ్నాప్ చేశాడంటే పక్కా ప్లాన్ ప్రకారమే చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news