మహాలక్ష్మీ పథకానికి మరో 22 కొత్త ఆర్టీసీ బస్సులు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

-

తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణికులకి శుభవార్త చెబుతూ.. మరో 22 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పచ్చ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అంతేకాకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కొత్త బస్సును నడిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ చాలా ఆరోగ్యంగా ఉందని, దానికి కారణం ప్రభుత్వమేనని కొనయాడారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులు ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న 21 శాతం ఫిట్ మెంట్ ప్రకటించినందుకు సీఎం, డిప్యూటి సీఎం, మంత్రులకి దన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అంతేగాక ఆర్పీఎస్ బాండ్స్ మొదటి ఇన్ స్టాల్ మెంట్ కోసం 280 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, అందుకు మరోసారి ఆర్టీసీ ఉద్యోగుల తరపున ప్రభుత్వానికి హృదయ పూర్వక దన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు కొత్త బస్సులు విడుదల చేసిందని, ఇప్పుడు మరో 22 కాలుష్యరహిత బస్సులు ఆర్టీసీలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఇవ్వాళ విడుదల చేసిన కొత్త ఎలక్ట్రికల్ నాన్ ఏసీ బస్సులు మహలక్ష్మి పథకానికి అనుసందానం చేస్తున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news