ఆర్టీసీ నీ అమ్మేదే లేదు : డిప్యూటీ సీఎం భట్టి

-

ఆర్టీసీని అమ్మేలేదు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ లో 25 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం ప్రారంభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జెండా ఊపి ప్రారంభించగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బస్సు నడిపారు. ఈ బస్సులో విద్యార్థులతో పాటు, పలువురు నేతలు ప్రయాణించారు.

బస్సు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి ఆర్టీసీ, సింగరేణి ద్వారా దాదాపు లక్ష మందికి ఉపాధి కలుగుతోందని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మబోమని తెలిపారు. ఆర్టీసీని నష్టాల్లో కూడా ఉండనీయబోమని వెల్లడించారు. ఆర్టీసీ బస్సులను పరుగులు పెట్టిస్తూ.. ప్రజలకు సేవలు అందించేలా చూస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news