వరంగల్ జిల్లాలో 256 కిలోల గంజాయి స్వాధీనం..!

-

భారీ స్థాయిలో తరలిస్తున్న గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకుంది. రూ.64 లక్షల విలువ గల 256 కిలోల గంజాయి సహా రెండు కార్లు, మూడు మొబైల్స్ పట్టుబడినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన బానోతు బాబు కుమారస్వామి, నస్సురి కుమారస్వామి లు జీవనోపాధి కోసం కారు డ్రైవింగ్ చేసేవారు.

ఈజీ మనీ కోసం అలవాటు పడిన వీరు చెడు మార్గం వైపు వెళ్లారు. ఈ క్రమంలోనే ఏపీలోని డొంకరాయి పరిసర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు రహస్యంగా తరలించి గంజాయిని ఎక్కువ ధరకు విక్రయించేవారు. ఈ క్రమంలోనే డొంకరాయి లోని ముకుంద్ తో వీరికి పరిచయం ఏర్పడింది. మరో ముగ్గురితో కలిసి 256 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. రెండు కిలోల చొప్పున మొత్తం 128 ప్యాకెట్లలో సిద్దం చేసి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏపీలోని డొంకరాయి ప్రాంతం నుండి గంజాయి కొనుగోలు చేసి స్మగ్లింగ్ చేస్తుంది ఈ ముఠా.

Read more RELATED
Recommended to you

Latest news