కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నాం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

-

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. గత ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ధరణి అన్న సంగతి ఈరోజుకి కూడా వాళ్ళు తెలుసుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. అప్పటి పీసీసీ ప్రెసిడెంట్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మా ప్రభుత్వం రాగానే ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుతూమని ఆనాడే చెప్పామన్నారు.

నిన్న అసెంబ్లీలో ఈనాటి ప్రతి పక్షమైన బీఆర్ఎస్ నాయకులు మా ధరణి వల్ల కోటి మంది ఆనందంగా ఉన్నారని వారి సొంత డబ్బా కొట్టుకున్నారు అంటూ మండిపడ్డారు. దేశంలో ఉన్న 18 రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి.. వాటిలో ఉన్న మంచిని తీసుకొని ఒక కొత్త చట్టాన్ని తీసుకు రాబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. కవులు, కళాకారులు, గ్రామాల్లోని రైతులు ఇలా ప్రతీ ఒక్కరి సూచన మేరకు మంచిని తీసుకొని మంచి రెవెన్యూ చట్టం తయారు చేయబోతున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news