తెలంగాణలో ఏడాదికి చికెన్‌ ఎంత తింటారో తెలుసా..?

-

తెలంగాణ అమితంగా ఇష్టపడే చికెన్‌ ఏడాది 3.6 లక్షల టన్నుల తింటున్నారని పశుపంవర్ధక శాఖ తయారు చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. ఒక కిలో చికెన్‌లో 250 గ్రాముల ప్రోటీన్‌లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో మాంసాహార ప్రియులు ఎక్కువగా ఆరగించేది చికెనే అని లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. ఇటీవల పశుసంవర్ధక శాఖ రూపొందించిన ఓ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని మొత్తం మాంసాహార మార్కెట్‌లో 44 శాతం చికెన్‌దేనని తేటతెల్లమైంది. ప్రతి ఏడాది తెలంగాణ వాసులు 3,63,850 టన్నుల కోడికూర తింటున్నారని పేర్కొంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పెంచుకొని తినే (నాటుకోళ్లు) ఈ లెక్కలో పరిగణించలేదని అధికారులు అంటున్నారు.

25 శాతం పోటీన్లు..

ఇతర మాంసాహారాల్లో గొర్రె మాంసం 32 శాతం, మేక 8 శాతం, నల్లజాతి పశువుల మాంసం 14 శాతం తింటున్నట్లు తెలిసింది. చికెన్‌లో 25 శాతం ప్రోటీన్లు ఉంటాయని, మటన్‌లో 20 శాతం మాత్రమే ప్రోటీన్లు ఉంటాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల దేశంలోని దాదాపు 10 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కనిపించింది. రెండేళ్ల క్రితం తెలంగాణలో బర్డ్‌ఫ్లూ కారణంగా లారీల కొద్ది కోళ్లను పూర్చిపెట్టారు. ఈ సారి కూడా దేశంలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కన్పించడంతో మన రాష్ట్ర చికెన్‌ మార్కెట్‌పై కూడా కొంత ప్రభావం చూపింది. అయితే పశుసంవర్ధక శాఖ అ«ధికారులు మాత్రం తెలంగాణలో బర్డ్‌ఫ్లూ బల్లగుద్ది చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 3 వేల కోళ్ల ఫారాలు ఉండగా, వాటిలోని 75 శాతం ఫారాలను నుంచి పశుసంవర్ధక శాఖ అధికారులు నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. వాటిలో ఎలాంటి ఆనవాళ్లు కన్పించకపోవడంతో చికెన్‌ వినియోగంపై రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను ఆ శాఖ నివృత్తి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news