పోలీసులకు లొంగిపోయిన 33 మంది మావోయిస్టులు

-

లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల వరుసగా పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలిపారు. అలాగే వీళ్లపై రూ.5 లక్షల రివార్డ్ ఉందని పేర్కొన్నారు.

 

ఇదిలా ఉంటే.. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ పోలీసులు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వరుసగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 50 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు పోలీసులకు లొంగిపోయారు. అయితే తాజాగా మరో 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు. శనివారం ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక జూన్ 1 నాటికి ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 4న కౌంటింగ్ ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news