మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వారు పాడటం ఏంటి..? సీఎం రేవంత్ కు టీసీఎంఏ లేఖ

-

తెలంగాణ రాష్ట్ర గీతంపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను రేవంత్ ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గీతాన్ని కీరవాణి కంపోజ్ చేయడం ఏమిటని? తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ (టీసీఎంఏ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. జయ జయహే తెలంగాణ.. గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించినందుకు గర్వపడుతున్నట్లు పేర్కొంది. గత ప్రభుత్వం ఈ పాట విషయంలో ఎన్నో తప్పులు చేసిందని విమర్శించింది. రాష్ట్రం ఏర్పాటుకు ముందే ఈ పాట ప్రజలకు ఎంతో చేరువైందని తెలిపింది.

తాజాగా ఈ పాట మళ్ళీ పుట్టి పురుడు పోసుకుంటున్న శుభ తరుణమిది అని పేర్కొంది. జయ జయహే తెలంగాణ.. పాటకు సంగీత దర్శకుడు కీరవాణి సంగీతాన్ని అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుందని తెలిపింది. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో మీకు తెలియంది కాదు, మన ఉద్యోగాలు మనకే రావాలి, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం.

Read more RELATED
Recommended to you

Latest news