నేటి నుంచి 36వ జాతీయ పుస్తక ప్రదర్శన

-

పుస్తక ప్రియులకు శుభవార్త. మీరు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా మిమ్మల్ని అలరించేందుకు జాతీయ పుస్తక ప్రదర్శన వచ్చేసింది. ఈరోజు నుంచి ఈనెల 19వ తేదీ వరకు పది రోజుల పాటు హైదరాబాద్‌లోని తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్‌ స్టేడియం)లో 36వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు.

ఈ పుస్తక మహోత్సవాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని జూలూరు గౌరీశంకర్‌ చెప్పారు. 10 నుంచి 18వ తేదీ వరకు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. మొత్తం 365 స్టాళ్లలో అన్ని భాషలకు చెందిన లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. మరోవైపు ఈ బుక్ ఫెయిర్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని తెలిపారు. అలాగే శని, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news