టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలింది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియా పోస్టులపై 4 కేసులు నమోదు అయ్యాయి. రేవంత్ రెడ్డి పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంతో కేసులు నమోదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.
నిందితుల పై ఐటి యాక్ట్ తో పాటు BNS 352,353(1)(b) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కాపీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా సంధ్య థియేటర్ సంఘటన లో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యారు.
అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియా పోస్టులపై 4 కేసులు నమోదు
రేవంత్ రెడ్డి పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ
కేసులు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
నిందితుల పై ఐటి యాక్ట్ తో పాటు BNS 352,353(1)(b) సెక్షన్ ల కింద కేస్ నమోదు https://t.co/sn4Av6TRaq pic.twitter.com/yYrufDgD4H
— Telugu Scribe (@TeluguScribe) December 18, 2024