హైదరాబాద్‌ విమానాశ్రయానికి 4 స్టార్‌ రేటింగ్‌

-

దేశంలో పేరుగాంచిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హైదరాబాద్​లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రం ఒకటి. ఈ ఎయిర్​పోర్టులో గత మూడేళ్లుగా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా గత జులై నుంచి విపరీతంగా రద్దీ ఉంటోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈఎయిర్​పోర్టు నిర్వహణ, సేవలకు గానూ జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ స్కైట్రాక్స్‌ నుంచి 4 స్టార్‌ రేటింగ్‌ లభించింది. ఇటీవల నిర్వహించిన ఆడిట్‌ తర్వాత దీన్ని ప్రకటించినట్లు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌(జీహెచ్‌ఐఏఎల్‌) వెల్లడించింది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని అధునాతన డిజిటల్‌ టెక్నాలజీలను అమలు చేయడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తున్నామని, దీని ఫలితమే ఈ రేటింగ్‌ అని జీహెచ్‌ఐఏఎల్‌ సీఈఓ ప్రదీప్‌ పణికర్‌ వెల్లడించారు. విమానాశ్రయం నిర్వహణ, ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, పరిశుభ్రత ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఈ రేటింగ్‌ను అందిస్తుందన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version