Telangana : రాష్ట్రంలో 47 ఉత్తమ పంచాయతీలకు అవార్డులు

-

తెలంగాణ వ్యాప్తంగా 47 గ్రామపంచాయతీలకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డులు ప్రకటించింది. మూడు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి సంస్థలనూ ఉత్తమ అవార్డులకు ఎంపిక చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో అవార్డులను ప్రదానం చేస్తారు.

ఈ ఏడాది ఉత్తమ పంచాయతీల ఎంపిక విధానాన్ని కేంద్రం ప్రభుత్వం మార్చింది. తొమ్మిది కేటగిరీల్లో అవార్డులు ఇవ్వాలని, దీనిలో ప్రతి గ్రామం పాల్గొనే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తొమ్మిది విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్న పంచాయతీలను కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేశారు. ప్రతి దశలోనూ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి, సమగ్ర పరిశీలన జరిపి అవార్డులకు ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమమైన వాటిని జాతీయ అవార్డుల పోటీకి పంపింది. వచ్చే నెల 24న జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాలకు జాతీయ అవార్డులు ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Latest news