8, 9 తరగతులు చదివి ఫేస్ బుక్ ని బాగా వాడుతున్నారు…! పోలీసులనే టార్గెట్ చేసి మరీ

-

నల్గొండ పోలీసుల అదుపులో పోలీస్ ఫేస్ బుక్ ఫేక్ ప్రొఫైల్స్ ముఠా ? ఉంది. ఫేస్ బుక్ లో నకిలీ పోలీస్ ఖాతాలు సృష్టించి డబ్బు దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు రాజస్థాన్ భరత్ పూర్ నుండి ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించారు. పోలీసుల ప్రొఫైల్స్ తో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి డబ్బు అవసరం ఉందంటూ లక్షలు కాజేసారు. 10 మంది పైగా నిందితులు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఒక్కో నిందితుడి నుండి 100 కు పైగా సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. నిందితుల్లో మైనర్ లే ఎక్కువ,8, 9 తరగతులు మాత్రమే చదువుకున్న ముఠా సభ్యులు పోలీసులను టార్గెట్ చేసారు. తెలంగాణ, ఏపి, తమిళ నాడు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఒడ్డిశా రాష్ట్రంలోని పోలీస్ ప్రొఫైల్స్ ను వాడుకుని మోసాలకి పాల్పడ్డారు. డీజీపీ ఆదేశాలతో కేస్ మానిటరింగ్ చేసారు నల్గొండ ఎస్పి రంగనాథ్. దేశంలో ఇప్పటి వరకు వాళ్ళు ఎవరికి దొరకలేదు అని పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news