90 శాతం ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే : సీఎం రేవంత్ రెడ్డి

-

90 శాతం మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని స్టూడెంట్స్ కి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వందేమాతరం ఫౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా మా బాధ్యతను గుర్తు చేసిందన్నారు. ప్రయివేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమని కొనియాడారు.

కార్పొరేట్ పాఠశాలలతో విద్యార్థులు పోటీపడటం మా గౌరవాన్ని మరింత పెంచింది సంతోషం వ్యక్తం చేశారు. నాతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనని గుర్తు చేశారు. విద్యార్థులు రావడం లేదని సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని.. మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే ఆ పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. కానీ సింగిల్ టీచర్ పాఠశాలలను మూసేయొద్దని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రతీ గ్రామం, ప్రతీ తండాకు విద్యను అందించేలా ప్రభుత్వం ముందుకెళుతుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news