తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు తెలంగాణ వైద్యశాఖ మంత్రి హరీష్ రావు. 2014 నుంచి ఆరోగ్యశాఖలో 22, 263 మందిని నియమించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆరోగ్యశాఖలో మరో రెండు నెలల్లో 9,222 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
టి డయాగ్నొస్టిక్స్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న 54 రకాల పరీక్షలను… జూన్ నుంచి 134కు పెంచుతున్నట్లు ప్రకటించారు. పేదలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. వైద్య శాఖలో 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. 1,331 మంది ఆయుష్ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించామని వెల్లడించారు. రాష్ట్ర వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరగుతున్నాయని అన్నారు. కొత్తగా ఎంపికైన 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు హరీశ్ నియామకపత్రాలు అందజేశారు.