సోషల్ మీడియా వచ్చాక.. ప్రపంచమే మారిపోయింది. ప్రపంచం అంతటా సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉందో చూస్తున్నాము. వయసుతో సంబంధం లేకుండా అందరూ సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఇదే తమ జీవిత లక్ష్యంగా 24 /7 అందులోనే ఉంటున్నారు. దీని వలన పిల్ల ఆరోగ్యం, భవిష్యత్తు అన్నీ పాడవుతున్నాయి. అంతేకాదు… సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజామా.. అబద్ధమా అనే విషయం తెలియడం లేదు.
అన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. తాజాగా ఈ సోషల్ మీడియా కారణంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి వివాదంలో చిక్కుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… ఆయన ఇంట్లో ఏనుగు దంతాల వంటి వస్తువు కెమెరాకు చిక్కాయి. ఈ క్రమంలో దీనిపై ఫారెస్ట్&వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ స్పందించింది. ‘ఎంపీ అర్వింద్ గా రు… ఇది ఏనుగు దంతాలా? లేక మరి ఏదైనా కళాఖండమా అనేది స్పష్టం చేయండి’ అని ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తెలంగాణ DGP, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి ఫిర్యాదు చేసింది.
BJP పార్టీ MP అయివుండి
నట్టింట్లో ఏనుగు దంతాలను పెట్టుకొని
మీడియా అంటే ఏ మాత్రం భయం లేకుండ
ఇంటర్వూ ఇస్తున్నావ్..నీ ఇంట్లోకి ఏనుగు దంతం ఎక్కడి నుండి వచ్చింది..
నువ్వు చేసేది రాజకీయమా లేక వ్యాపారమా pic.twitter.com/gN2US2ZuJ2— 🇷 🇦 🇲 (@ram_views) May 22, 2023