ఫోర్త్ సిటీ ప్రకటన వెనుక పెద్ద భూదందా కొనసాగుతుంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం గుర్రంగూడలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ముందుగానే వేల ఎకరాలను అగ్గువకు కొని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మాదిరిగానే భూదందాతో వేల కోట్ల ఆస్తులను పోగు చేసుకునేందుకు పోర్త్ సిటీ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు.

ధరణీ పేరును భూమాతగా మార్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. భూమాతను భూమేతకు ఉపయోగించుకునేందుకు సిద్దమవుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ధరణీ పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి 24లక్షల ఎకరాల అసైన్డ్ భూములుంటే.. ఇప్పుడు అవి 5 లక్షలకు ఎలా తగ్గాయని ప్రశ్నించారు. ధరణీ పేరుతో బీఆర్ఎస్ నేతలు భూములు దండుకున్నారని.. రిజిస్ట్రేషన్లు చేపించుకున్నటువంటి భూముల వివరాలను రేవంత్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ధరణీ భూముల అన్యాక్రాంతం పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news