గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగర ప్రజలను.. వనికి పోయేలా చేస్తుంది హైడ్రా. పొద్దున లేస్తే చాలు.. హైడ్రాధికారులు ఏ ఇంటికి వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఏ ఇంటిని బద్దలు కొట్టి… రచ్చ చేస్తారో… అని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. అయితే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి జనాలు విపరీతంగా తిడుతున్నారు. రేవంత్ రెడ్డి పాలనను విమర్శిస్తున్నారు. అయితే దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో… హైడ్రాధికారులు… హైదరాబాద్ ప్రజలకు భారీ ఊరట ఇచ్చారు.
అక్రమ కూల్చివేతలకు హైడ్రా బ్రేక్ వేసినట్లు సమాచారం అందుతోంది. మూడు రోజుల పాటు హైదరాబాదులో ఎలాంటి కూల్చివేతలు జరుపకూడదని హైడ్రాధికారులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాలు ఇచ్చినట్లు.. వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూడు నెలల్లో.. హైదరాబాదులో ఉన్న చెరువులను సర్వేలు… పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మళ్లీ కూల్చివేతలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయట. అప్పటివరకు కూల్చివేతలు జరుపకూడదని.. ఓ నిర్ణయానికి వచ్చారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.