వివాదం: తెలంగాణాలో దళితుడుని ఆలయానికి అనుమతించని పూజారి

ప్రపంచం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. అయినా సరే కులాలు వివాదాలు ఎన్నో నడుస్తూనే ఉన్నాయి. ఎంత అవగాహన కల్పించినా సరే ఏదోక వివాదం అనేది చోటు చేసుకుంటూనే ఉంది. ప్రజల్లో అవగాహన ఉన్నా సరే కొంత మంది అగ్ర కులాలకు చెందిన వారు వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తెలంగాణాలో ఒక ఘటన చోటు చేసుకుంది. జనగామ జిల్లాలో వివాదాస్పద ఘటన జరిగింది.

జనగామ అభయాంజనేయస్వామి ఆలయంలో దళితుడికి పూజలు చేయనని వెనక్కి పంపించాడు సదరు ఆలయ పూజారి. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాలు ఆలయం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పూజారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.