టీఆర్ఎస్‌పార్టీ గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.వచ్చే నెలలో జరగనున్న బల్దియా ఎన్నికలను ప్రత్రిష్ఠాత్మంగా తీసుకున్నారు సీఎం కేసీఆర్..ఎన్నికలు ఎప్పుడు వచ్చిన విజయం గులాబీదే అన్న విశ్వాసంతో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీకి దుబ్బాక ఉప ఎన్నిక షాక్ ఇచ్చింది.షాక్ నుంచి కొలుకోకముందే ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేయడంతో ఇప్పుడు గులాబీ నేతల్లో గుబులు పట్టుకుంది.గ్రేటర్ ఎన్నికలు ఎంతమంది మంత్రులు,ఎమ్మెల్యేల భవిష్యత్‌పై ఎఫెక్ట్ పడుతోందోనని అందోళన చెందుతున్నారు.
మరోవైపు బల్దియా ఎన్నికలను కేసీఆర్ వ్యక్తిగతంగా తీసుకున్నట్లు తెలుస్తుంది.నిన్న ప్రగతి భవన్ మధ్యాహ్నాం నుంచి రాత్రి వరకూ అధికారులు, పార్టీ కార్యదర్శులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సుదీర్ఘసమావేశం నిర్వహించారు.దుబ్బాకలో పార్టీ ఓటమిపై పార్టీ లీడర్లతో చర్చించినట్లు తెలుస్తుంది.దుబ్బాక ఓటమి బల్దియా ఎన్నికలపై పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, అనుసరించవల్సిన వ్యూహాలను పార్టీ నేతలకు వివరించినట్లు తెలుస్తుంది..
దుబ్బాకలో టీఆర్‌ఎస్ ఓటమికి ఎంఐఎం పరోక్షంగా సహకరించినట్లు వస్తున్న వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఓవైసీ ఏకాంతంగా భేటీ కావడంపై ఇప్పుడు సర్వత్రా ఆసాక్తి నెలకొంది.టీఆర్‌ఎస్ ఓటమికి ఎంఐఎం ముఖ్యకారణం అంటుంటే వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో కొంత చర్చకు దారితీస్తున్నాయి.మంత్రి హరీష్ రావును ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు కావాలనే కేసీఆర్ ,ఎంఐఎం పావులు కదిపి దుబ్బాకలో టీఆర్‌ఎస్ ఓటమికి పరోక్షంగా కారణయ్యారా అని నెట్టింట్లో చర్చ జరుగుతుంది.
దుబ్బాకలో ఓటమితో పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి. బల్దియా ఎన్నికల్లో అన్నితానై ఎన్నికల ప్రక్రియను ముందుకు నడపనున్నారు కేసీఆర్..అందుకు అనుగూణంగానే పార్టీనేతలతో సుదీర్ఘసమయం భేటీ అయ్యారు.ఈ సారి గ్రేటర్ ఎన్నిలకు కేసీఆర్ నాయకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది.తానే బాధ్యతలు తీసుకోనున్నట్లు ముఖ్యుల వద్ద కేసీఆర్ పేర్కోన్నట్లు తెలుస్తుంది.
ప్రతి సారి గ్రేటర్ ఎన్నికలను మున్సిపల్ మంత్రి కేటీఆర్ ముందుండి నడిపించేవారు.కాని ఈసారి కేటీఆర్‌ను ఎన్నికల ప్రచారంకు దూరం పెట్టె అవకాశాలు కన్పిస్తున్నాయి.ఇటీవలె కురిసిన భారీ వర్షాలతో వరద నియంత్రణ చర్యలు చెప్పటడంలో మంత్రిగా కేటీఆర్ విఫలం చెందారని పార్టీ వర్గాల్లో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి.అదే విషయం కేసీఆర్ వద్దకు కూడా వెళ్లింది.నిఘా వర్గాల నుంచి వివరాలు తెప్పించుకున్నారు సీఎం కేసీఆర్.పరిస్థితి గతం ఎన్నికల కంటే ఈ సారి పూర్ది విరుధంగా ఉండటంలో స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగనున్నారు.
గ్రేటర్ పరిధిలోని మంత్రుల పరిస్థితి మరి దారుణంగా ఉంది..ఇటీవలె గ్రేటర్లో వచ్చిన వరదలు హైదరాబాద్ లో మంత్రులు, ఎమ్మెల్యేల తీరుతో ప్రజలు ఆగ్రహాంగా ఉన్నారు.వరద సాయం ఇవ్వడంలో పక్షపాతం వహిస్తున్నారాని గ్రేటర్ వాసులు ఆవేదనతో ఉన్నారు.వదర సమయంతో నేతలు ప్రజలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది.ఎల్ఆర్‌ఎస్ స్కీమ్‌పై ప్రభుత్వం వైకరిపై ప్రజలు కోపంగా ఉన్నారు.ఇన్ని సమస్యలపై ప్రజలను ఒప్పించి…ఓట్లుగా మార్చుకోవడం టీఆర్ఎస్ పార్టీకి కత్తిమీద సాములాంటిదే..ఇది ఈ సమస్యలను ఆడ్రస్ చేస్తూ ప్రజల తమవైపు తిప్పుకోవడం ఒక్క కేసీఆర్ తప్ప మరో నేత ఎవ్వరు చేయలేరు.అందుకే కేసీఆర్ స్వయంగా రంగంలో దిగాలని సీఎం దగ్గర ముఖ్యనేతుల వాపోయినట్లు సమాచారం.
గ్రేటర్‌లో మంత్రుల పరిస్థితి మరోలా ఉంది.ఇప్పటి వరకూ ఉన్న మంత్రుల పని తీరుపై కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది.వచ్చే గ్రేటర్ ఎన్నికలు ఈ మంత్రులతో కలిసి వెలిసివెలితే ఓటమి తప్పేలా లేదని గ్రహించిన కేసీఆర్ తానే స్వయంగా ప్రచారంలో పాల్గొంటారని సన్నితులు అంటున్నారు.అదే విధంగా గ్రేటర్ మంత్రుల్లో మార్పులు చేర్పులు చేయాలని కేపీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.గ్రేటర్ ఎన్నికలు వచ్చేలోపు కొంత మంత్రులను పదవి నుంచి తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి.డిప్యూటీ స్పీకర్ పద్మరావును గౌడ సామాజిక వర్గం నుంచి మంత్రి వర్గంలో మళ్లీ తీసుకోవాలని.సికింద్రబాద్‌లో కీలకమైన నేత కావడంలో మంత్రి వర్గంలో తీసుకునే చాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. గ్రేటర్ ఎన్నికలతో పాటు త్వరలోనే వరంగల్ నగరపాలక ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు ఉన్నందున..వరంగల్ నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాష్కర్‌ను కూడా మంత్రి వర్గంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి..
మరోవైపు ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు తొందర్లోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు.గ్రేటర్ ఎన్నికలు వచ్చేలోపు వారి ఎన్నిక ప్రక్రియలు పూర్తి చేసి గ్రేటర్ ఎన్నికల్లో వారిని విసృతంగా వాడుకోవాలని కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తుంది.ఏదిఏమైన గ్రేటర్ ఎన్నికలు,దుబ్బాక ఓటమి టీఆర్‌ఎస్ పార్టీలో చాలా మార్పులను తీసుకురానున్నాయి..చాలా మంది మంత్రుల్లో పదవి గండంతో బిక్కుబిక్కుమంటు గుడుపుతున్నారు.గ్రేటర్ ఎన్నికలు మంత్రులకు మెడమీద కత్తిలాగా తయారయ్యాయి.