పబ్జీ గేమ్ తో పరిచయం..ఆ తర్వాత యువతిపై లైంగిక దాడి !

-

పబ్జీ గేమ్ మన దేశంలో బ్యాన్‌ అయిన సంగతి తెలిసిందే. చైనా యాప్‌ కావడంతో.. కరోనా సమయంలో పబ్జీ గేమ్ ను కూడా బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే… గతంలో పబ్జీ గేమ్ ఆడిన ఇండియన్స్‌ చాలా మంది ఉన్నారు. అలాగే ఈ పబ్జీ గేమ్ ఆడి.. ప్రాణాలు పొగోట్టుకున్న వారు ఉన్నాయి. అయితే.. తాజాగా ఈ పబ్జీ గేమ్ తో పరిచయం ఏర్పడి..ఆ తర్వాత యువతిపై లైంగిక దాడి చోటు చేసుకున్న సంఘటన తాజాగా హైదరాబాద్‌ లో జరిగింది.

వివరాల్లోకి వెళితే… పబ్జీ గేమ్ ద్వారా పరిచయం అయిన ఓ యువతికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు ఓ యువకుడు. అంతేకాకుండా నగ్న ఫోటోలు తీసి.. ఆ యువతిని బ్లాక్ మెయిల్ కూడా చేశాడు. దీంతో ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసింది ఆ యువతి. మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news